ఆమె మరో క్వీన్ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగానారౌనత్ను.. శివగామి రమ్యకృష్ణ పొగిడారు. రమకృష్ణ ఇటీవల ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన క్వీన్ అనే వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం తమిళనాడు మాజీసీఎం జయలలిత జీవితచరిత్ర ఆధారంగా రూపొందించారని సినీవర్గాల టాక్. కాగా ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ను తమిళంలో ‘తలైవి’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నది. కంగన ఒక ఇంటర్వూలో రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ .. ‘రమ్యకృష్ణ మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్రెస్ అని.. బాహుబలి సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ నటన అద్భుతమని…’ పొగిడింది. ఇప్పుడు ‘క్వీన్’ సెకండ్ సీజన్ మొదలవుతున్న సందర్భంగా రమ్యకృష్ణను కంగనా గురించి అభిప్రాయం అడగ్గా.. ‘కంగన’ ఎంతో ధైర్యవంతురాలు.. మరో క్వీన్..”అంటూ మెచ్చుకుంది రమ్యకృష్ణ.
- June 14, 2020
- Archive
- సినిమా
- KANGANA
- KOLLYWOOD
- QWEEN
- RAMYA KRISHNA
- TAMIL
- VASUDEVA MEENAN
- జయలలిత
- జీవితచరిత్ర
- Comments Off on ఆమె మరో క్వీన్