లాహోర్: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిది ఆఫ్రిది.. కరోనా వైరస్ బారినపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఓ పెద్దస్థాయి క్రికెటర్‌కు వైరస్ సోకడం ఇదే తొలిసారి. ‘గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా. జ్వరం కూడా రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌గా తేలింది. నేను కోలుకోవాలని మీరు ప్రార్థిస్తారని కోరుకుంటున్నా’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు.
కరోనా కారణంగా ఆగిపోయిన పాక్ సూపర్ లీగ్‌లో ఆడిన ఆఫ్రిది.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు తన ఫౌండేషన్ ద్వారా చాలా మంది సాయం అందించాడు. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఆఫ్రిది త్వరగా కోలుకోవాలని పాక్ క్రికెట్ బోర్డుతో పాటు పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ విషయంలో ఆఫ్రిదిపై తీవ్ర విమర్శలు చేసి ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా అతను త్వరగా కోలుకోవాలని ఆశించాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆఫ్రిది పాక్ తరఫున 398 వన్డేలు, 27 టెస్టులు, 99 టీ20ల్లో పాల్గొన్నాడు.