సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్ చేసేందుకు రూ. 2 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో రాజశేఖర్ కుటుంబం దాతల కోసం వేచిచూస్తున్నది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రాజశేఖర్ భార్య విలపిస్తున్నది. సాయం చేయదల్చుకున్నవారు మండల రాజశేఖర్, ఖాతానంబర్ 231310100048210 ( ఆంధ్రాబ్యాంకు రామడుగు శాఖ) ఐఎఫ్ఎసీకోడ్ ANDB000231 నంబరుకు ఆర్థిక సహాయం అందించాలని బాధితుడి కుటుంబం వేడుకుంటుంది.
- August 24, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- FEE
- HOSPITAL
- KARIMNAGAR
- RAMADUGU
- ROADACCIDENT
- ఆస్పత్రి
- దాతలు
- రోడ్డుప్రమాదం
- సాయం
- Comments Off on ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి