సారథిన్యూస్, రామడుగు: ఉన్నత విద్యనభ్యసించిన యువత వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారు. పట్టణాల్లో వేల రూపాయలు సంపాదించే కొలువులు వదిలి పల్లె బాటపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మాలపూర్కు చెందిన కట్ట శ్రీను ఆధునిక పద్ధతిలో అంజీరాను సాగుచేస్తున్నాడు. శ్రీరాముల పల్లెలో దాదాపు 10 మంది యువ రైతులు వంద ఎకరాల్లో యాంత్రీకరణ పద్ధతి ద్వారా వరి నాట్లు వేస్తున్నారు. గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, వేణు రెడ్డి మహేందర్ రెడ్డి తమిళనాడు రైతుల సూచనలతో పెట్టెల ద్వారా నారుపోస్తున్నారు. యాంత్రీకరణతో సాగుచేస్తే కూలీల కొరత సమస్య ఉండదని వారు తెలిపారు.
- July 2, 2020
- Archive
- కరీంనగర్
- AGRICULTURE
- KARIMNAGAR
- RAMADUGU
- YOUTH
- ఆధునికం
- వ్యవసాయం
- Comments Off on ఆధునికం.. అధికలాభం