Breaking News

ఆదాశర్మ.. డేరింగ్ డెసిషన్


డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌లో మెరిసింది అదాశర్మ. ఈ చిత్రంతో కుర్రకారుకి కిక్కెంచించిన ఆదాశర్మ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ కైపెక్కిస్తోంది. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి వంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తనను పట్టించుకోకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది. మితిమీరిన అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ హాట్ భామగా మారిన ఆదాశర్మకు సినిమాల ఆఫర్స్ తలుపుతట్టకపోవడంతో వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌పై దృష్టి సారించింది.

తాజాగా అదా శర్మ ఓ ఛాలెంజింగ్ రోల్‌కి రెడీ అయ్యింది. ‘మ్యాన్ టు మ్యాన్’ పేరుతో తెరకెక్కబోయే చిత్రంలో అబ్బాయిగా కనిపించబోతుందట. అబ్బాయిగా పుట్టి పెరిగి లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారి తనకు నచ్చిన ఓ అబ్బాయిని పెళ్లాడుతుందట ఈ సినిమాలో. అయితే అతనితో వివాహం జరిగాక ఆమెకు ఎదురైన ఛాలెంజ్‌ ఏమిటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొందనే కథనంతో ఈ సినిమా కథ ఉండబోతుందట. మొత్తానికి ఓ ప్రయోగాత్మక పాత్ర ద్వారా రిస్క్ చేయడానికి రెడీ అయిన ఆదాశర్మకు ఈ సినిమాతో అయినా క్రేజ్ దక్కేనా? చూడాలి మరి.