సారథి న్యూస్, రామాయంపేట: అగస్టు 15 కల్లా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో ఆరో విడుత హరితహారం సందర్భంగా మొక్కలు నాటారు. జిల్లాలో ని 75 క్లస్టర్ లలో రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో పరుశురాం నాయక్, మెదక్ ఆర్డీవో సాయిరాం, ఏడీ ఏ వసంత సుగుణ, తహసీల్దార్ జయరామ్, వ్యవసాయాధికారి సతీశ్, ఎంపీపీ సిద్ధరాములు, జెడ్పీటీసీ విజయ్ కుమార్, కో ఆప్షన్ మెంబర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
- June 30, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- HARITHAHARAM
- medak
- MLA
- PADMA
- PLANTS
- RAMAYAMPETA
- ఎమ్మెల్యే
- పద్మాదేవేందర్రెడ్డి
- Comments Off on ఆగస్టు15 కల్లా రైతు వేదికలు