సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆకలి తీర్చడంలోనే అసలైన సంతోషం ఉంటుందని శ్రీగాబ్రీయేల్ స్కూలు, న్యూటన్ గ్రీన్ ప్లే స్కూల్ విద్యాసంస్థల చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. అనంతరం హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్ లో ప్రింట్, అండ్ ఎలక్ర్టానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులను టీఆర్ఎస్ సీనియర్ నేత పారంద రమేష్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాయని, దీంతో ఎంతోమంది నిరుపేదలు, కార్మికులు, జర్నలిస్టులు ఉపాధి లేకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు రెండువేల మందికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశామని ప్రకటించారు. కార్యక్రమంలో శ్వాస స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కాటెపాక ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు దోమలపల్లి లక్ష్మణ్, నిర్వాహకులు సింగిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జెనిగె మహేందర్, కిరణ్ పాల్గొన్నారు.