సారథి న్యూస్, హుస్నాబాద్: అవయవ, శరీర దానాలకు 20 మంది అంగీకరించినట్లు అవయవదాన స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుంకరనేని సంధ్యకు అవయవదాన ప్రతినిధుల బృందం అంగీకార పత్రాలు అందజేశారు. తమ మరణానంతరం పార్థీవదేహాలతో పాటు నేత్రాలు, పలు అవయవాలు వైద్య విద్యార్థుల పరిశోధనకు తోడ్పడుతాయని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 20 మంది స్వచ్ఛందంగా ముందుకువచ్చారని వివరించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కోమురయ్య, ప్రతినిధులు రాజేందర్, మల్లారెడ్డి, రాజ్ కుమార్, కేదారి పాల్గొన్నారు.
- November 3, 2020
- Archive
- Top News
- HUSNABAD
- KAKATIYAMEDICAL COLLEGE
- SIDDIPETA
- SUNKARANENI
- కాకతీయ మెడికల్ కాలేజీ
- సిద్దిపేట
- సుంకరనేని
- హుస్నాబాద్
- Comments Off on అవయవదానానికి 20 మంది అంగీకారం