ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై అనూహ్య విజయాన్ని అందుకుంది ‘అల వైకుంఠపురములో’ చిత్రం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్ వార్దే ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. భారీ అంచనాలతో రూపొందబోయే ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరో అనుకుంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ రీమేక్ ను త్వరలో పట్టాలెక్కించేస్తారట. అతిత్వరలో ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ రీమేక్ లో కియారా అద్వానీని తీసుకున్నట్లు వార్తలు రాగా.. అందులో ఏమాత్రం నిజం లేదని.. పూజా చేసిన రోల్ ను హిందీలో జాన్వీ కపూర్ చేయనుందని సమాచారం. జాన్వీ కపూర్ త్వరలో ‘గుంజన్ సక్సెనా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతోపాటు మరో సినిమాలో జాన్వీకపూర్ నటిస్తోంది. కియారా అద్వానీ డేట్స్ సెట్ కాకపోవడం వల్లే ఆమె స్థానంలో ఈమెను ఎంపిక చేసినట్లుగా బాలీవుడ్ టాక్.
- July 30, 2020
- Archive
- Top News
- సినిమా
- ARJUNREDDY
- BOLLYWOOD
- JANVIKAPOOR
- KIYAARA
- అర్జున్‌రెడ్డి
- అలవైకుంఠపురములో
- కియారా
- జాన్వీకపూర్
- Comments Off on ‘అల వైకుంఠపురములో’.. రీమేక్