వీవీ వినాయక్ దర్శకత్వంలో మొదటిసారి ‘అల్లుడు శీను’గా వెండితెరకు పరిచమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాకే కమర్షియల్ హీరోగా పేరుతెచ్చుకున్న బెల్లంకొండ గతేడాది ‘రాక్షసుడు’తో హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ‘అల్లుడు అదుర్స్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకుందట. అయితే మిగతా షూటింగ్ లాక్ డౌన్ తో తాత్కాలికంగా వాయిదాపడింది. జూన్ మొదటివారం నుంచి షూటింగ్స్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.
ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఈ మూవీ షూటింగ్ ను వచ్చే నెల సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట చిత్రయూనిట్. జూలై మొదటివారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని.. పూర్తి కమర్షియల్ హంగులతో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీనివాస్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించడమే కాదు కొద్దిపాటి కామెడీతో కూడా అలరించనున్నాడట. ఈ చిత్రంలో శ్రీనివాస్ కు జోడీగా నభానటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.