సారథి న్యూస్, మెదక్: అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బ్యాంకులు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. చేనేత వృత్తులు, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుందని ఆయన సూచించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం అనంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల మంజూరుతో పాటు గ్రౌండింగ్ వివరాలను బ్యాంకుల వారీగా అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల మంజూరీలో సైతం అధికారులు ఇబ్బందులు కలిగించకుండా త్వరితగతిన బ్యాంకులు తమ వాటాను మంజూరు చేయాలని సూచించారు. అనంతరం వార్షిక రుణప్రణాళిక(2020 -2021)ను విడుదల చేశారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్మేనేజర్ రామకృష్ణారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
- July 15, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BANKLOANS
- medak
- కలెక్టర్
- బ్యాంకు రుణాలు
- మెదక్
- Comments Off on అర్హులందరికీ రుణాలు ఇవ్వండి