Breaking News

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు


సారథి న్యూస్, హుస్నాబాద్: అక్రమ అరెస్టులతో ఉద్యమన్ని ఆపలేరని బీజేపీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు ప్రజలను కంటతడి పెట్టిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయా బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు వేణుగోపాలరావు, మోహన్ నాయక్, నరేష్, అజయ్, కృష్ణ, కార్తీక్, సాగర్, సంపత్, సుధాకర్, కళ్యాణ్, శ్రీనాథ్, సాంబరాజు పాల్గొన్నారు