సారథి న్యూస్, నారాయణపేట: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ రైతన్నలా మారారు. అరక పట్టి పొలం దున్నారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత జడ్పీ హైస్కూలులో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. విత్తనాలు అందుతున్నాయా.. లేదా.. అని అడిగి ఆరా తీశారు. మంత్రి తమతో మమేకమవడం చూసి రైతులు ఆనందం వ్యక్తంచేశారు.
- June 4, 2020
- Top News
- తెలంగాణ
- NARAYANAPET
- SRINIVASGOUD
- నారాయణపేట
- నిడ్జింత
- మద్దూర్
- Comments Off on అరక పట్టి.. సాలు కొట్టి