- అనంత, విశాఖ జిల్లాల్లో కలకలం
సారథి న్యూస్, అనంతపురం: మిడతల దండు రైతులను కలవరవపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండు రోజుల క్రితం ఓ మిడతల దండు కనిపించింది. అలాగే విశాఖపట్నం జిల్లా కశింకోట మండలంలో కూడా పంటలపై ఈ దండు వాలింది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వివిధ పంటలపై దాడిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జిల్లేడు చెట్లపై మిడతల గుంపు వాలింది. వాటి సంచారంపై స్థానికులు, రైతులు అగ్రికల్చర్ అధికారులకు సమాచారమిచ్చారు.
ఖరీఫ్ పంటలపై మిడతల దాడి ప్రమాదకరంగా మారనుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జూన్, జూలై మాసాల్లో మిడతల ప్రభావం మరింతగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వమే పురుగు మందులను విమానాల ద్వారా స్ప్రే చేయించాలని భారత్ త్రిషక్ సమాజ్ కేంద్రానికి సూచించింది. ఈ ఏడాది మిడతల సమూహదాడిని నియంత్రించే శక్తి రాష్ట్రాలకు లేదని కేంద్రమే ఈ బాధ్యత చేపట్టాలని పేర్కొంది.