సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ దేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలనక్షత్రం రోజులలో సర్కారు సేవగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత మహాగణపతిపూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. భౌతికదూరం పాటిస్తూ ఈ పల్లకీ ఉత్సవాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించారని ఈవో రామారావు తెలిపారు.
- September 6, 2020
- Archive
- Top News
- ఆధ్యాత్మికం
- BRAMARAMBHADEVI
- MALLIKARJUNA SWAMY
- SRISAILAM
- భ్రమరాంబదేవి
- మల్లికార్జునస్వామి
- శ్రీశైలం
- Comments Off on అమ్మవారికి పల్లకీ ఉత్సవం