సారథి న్యూస్, వెంకటాపురం: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకదృష్టి సారించి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య సూచించారు. శుక్రవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి వ్యక్తిగత శ్రద్ధతో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండలంలో 9,774 ఇళ్లు ఉండగా,8,658 ఇన్లైన్ చేసినట్లు తెలిపారు. ఇంకా ప్రారంభించని ఇంకుడుగుంతల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలన్నారు.
ఈనెల 25వ తేదీలోగా ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. 76 అవాసాలకు గాను పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో వేగం పెంచాలన్నారు. సమావేశంలో వెంకటాపురం తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అనురాధ, ఎంపీపీ సతీష్ కుమార్, జడ్పీటీసీ పాయం రమణ, మండలంలోని గ్రామాల సర్పంచ్లు, గ్రామ ప్రత్యేక అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.