సారథిన్యూస్, రామాయంపేట: గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగించాలని మెదక్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ గ్రామానికి సీఎం కేసీఆర్ ఓఎస్డీ ( ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాజశేఖర్రెడ్డి రూ. 1.64 కోట్లు మంజూరు చేయించారు. ధర్మారం రాజశేఖర్రెడ్డి స్వగ్రామ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీవో సాయిరామ్ తదితరులు ఉన్నారు.
- August 28, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CM KCR
- COLLETOR
- DHARMARAM
- FUNDS
- medak
- RAMAYAMPET
- TOUR
- VILLAGE
- గ్రామం
- ఫండ్స్
- విడుదల
- Comments Off on అభివృద్ధి ఆగొద్దు