సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వంసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ పరిధిలోని జూబ్లీపురంలో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ స్వాతి , కొల్లు పద్మ, సర్పంచు బలరాం, టీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు , తూము చౌదరి, కొట్టు వెంకటేశ్వర్లు, అన్వర్ పాష, గౌస్, పరంజ్యోతి రావు, పురుషోత్తం, సంతోష్, జనార్ధన్, మేడిపల్లి బజార్, చిన్న బిక్షం, జయంతి రావు, రవి, వెంకయ్య, ముత్యాల రామ్ చందర్, సర్పంచులు సేవ, కిషన్, లాలు తదితరులు పాల్గొన్నారు.
- June 16, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- DEVOLOPMENT
- GOVERNMENT
- KOTHAGUDEM
- MLA
- VANAMA
- శంకుస్థాపన
- సీసీరోడ్డు
- Comments Off on అభివృద్ధికే అధికప్రాధాన్యం