Breaking News

అభిమానమంటే ఇదే మరి

అభిమానమంటే ఇదే మరి

స్టార్ హీరోలకు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉండడం పెద్ద విషయమేమీ కాదు. ఆ ఫాలోయింగ్​లో అభిమానులను అనుకరించడం ఇప్పటి ట్రెండ్​కు పెద్ద ఫ్యాషన్ అయింది కూడా. అదే ఎన్టీఆర్ విషయంలో జరుగుతోంది. ఎన్టీఆర్​కు టాలీవుడ్​లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే జపాన్​లో ఎన్టీఆర్ సినిమాలకు మాంచి డిమాండే ఉంది. అక్కడి వాళ్లు తారక్ చిత్రాలను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తాజాగా జపాన్​లో ఓ జంటకి ఎన్టీఆర్ పై అభిమానం పీక్స్​లోకి వెళ్లి పోయింది. వారి అభిమానం ఏ రేంజ్​లో ఉందో ఈ తాజా వీడియో తెలుపుతోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన అశోక్ సినిమాలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా నటించారు. ఆ చిత్రంలో ‘గోలా గోలా’ పాటకు ఈ జపనీస్ జంట సేమ్ టు సేమ్ హావాభావాలతో సహా ఎన్టీఆర్ ఎనర్జీకి ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్స్ వేసి .. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్భుతంగా ఉన్న వారి డ్యాన్స్​కు అభిమానులు ఫిదా అయిపోతూ వీడియోను వైరల్ చేస్తున్నారు.

https://youtu.be/PryZ73_8AUs