నిఖిల్ ఇండస్ర్టీకొచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ డిఫరెంట్ మూవీస్తో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు 20వ సినిమాకు చేరువలో ఉన్నాడు. ఈ సినిమా అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సోనాలి నారంగ్ ప్రెజెంట్స్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ గ్రూప్స్ అధినేతలు నారాయణ్ దాస్, పుష్కర్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. కాకపోతే ఇది నిఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో పాటు ఒక బెస్ట్ మూవీగా కూడా నిలిచిపోతుంది అంటున్నారు నిర్మాతలు.
ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజీస్’ చిత్రంలో నిఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ కథతో రూపొందుతున్న ఈ మూవీని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీంతోపాటు నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారట. రీసెంట్ గా పెళ్లిచేసుకున్న నిఖిల్ తన కెరీర్ పైనా స్పీడ్ పెంచేసినట్టున్నాడు. వరుస సినిమాలో పాటు వరుస స్ర్కిప్టులపై కూడా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.