న్యూఢిల్లీ: అన్లాక్-6.0 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను మరోనెల రోజులు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్ల బయట… దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్రాలు లాక్డౌన్విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది. సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలకు 200 మంది వరకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్ర పరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ ఆదేశించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రభుత్వాలు ఎటువంటి అంతరాయం కల్పించకూడదు. 10ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు అత్యవసరమైతేనే బయటికి రావాలి. అంతర్జాతీయ ప్రయాణికులు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లలో 50 శాతం వరకు అవకాశం కల్పిస్తూ.. సెప్టెంబర్ 30 ఆదేశాలు ఇచ్చిన కేంద్ర హోంశాఖ ఇవే ఆదేశాలు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని పేర్కొంది.
- October 28, 2020
- Archive
- Top News
- HOME AFFAIRS
- LOCKDOWN
- PM MODI
- UNLOCK6.0
- అన్లాక్–6
- కరోనా
- కేంద్రహోంశాఖ
- ప్రధాని మోడీ
- లాక్డౌన్
- Comments Off on అన్లాక్-6.0 కొత్త నిబంధనలు