సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కటకం రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
- July 19, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- CM
- KARIMNAGAR
- KCR
- RAMADUGU
- ఎమ్మెల్యే
- రామడుగు
- Comments Off on అన్నివర్గాలకు సంక్షేమఫలాలు