Breaking News

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరం: ప్రముఖనటుడు, మెగాబ్రదర్ ​నాగబాబు కూతురు, నటి నిహారిక తన భర్త చైతన్య, అత్తామామలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం దర్శించున్నారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. డిసెంబర్​ 9న చైతన్యతో నిహారిక పెళ్లి రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ప్యాలెస్​లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు సందడి చేశారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. కాగా, గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. హైదరాబాద్​లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడం కాగా, ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం వేడుకగా జరిగింది.