సారథిన్యూస్, సిరిసిల్ల: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లోని విద్యానగర్ లో అనుమతి లేకుండా శ్రీచైతన్య పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేని రంజిత్‌కుమార్, నాయకులు ప్రశాంత్, వినయ్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.
- June 24, 2020
- Archive
- లోకల్ న్యూస్
- ABVP
- DEO
- SCHOOLS
- SIRICILLA
- పాఠశాలల
- శ్రీచైతన్య
- Comments Off on అనుమతులు లేని స్కూళ్లపై కేసులు