Breaking News

అనారోగ్యంతో జర్నలిస్టు​ మృతి

సారథి న్యూస్​, కర్నూలు: వివిధ పత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేసిన అక్కలదేవి రాజా(30) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన రాజా.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేశారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో ఇక్కడి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రాజా తమ మధ్య లేకపోవడం బాధాకరమని వారు సంతాపం తెలిపారు.

One thought on “అనారోగ్యంతో జర్నలిస్టు​ మృతి”

  1. చాలా మంచి మనిషి. నాకు ఆప్తమిత్రుడు. ఆయన మరణం బాధాకరం

Comments are closed.