![టీఆర్ఎస్ జెండాలు పాతి ధర్నా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/TRSS-DHARNA.jpg?fit=1233%2C533&ssl=1)
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్లు ఆధ్వానంగా మారినా అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గుంతలుపడ్డ రోడ్లపై వారు టీఆర్ఎస్ జెండాలు పాతి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అక్క శ్రీనివాస్, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, రాజయ్య, కిష్టస్వామి, రాజు, సది తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.