వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వైట్‌హౌస్ సౌత్‌లాన్ నుంచి ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. తాను సగర్వంగా ఈ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో చేసిన పురోగతికి తాను గర్వపడుతున్నానని చెప్పారు. రెండోసారి తనను గెలిపించేందుకు అమెరికా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌కు అధికారం కట్టబెడితే ఆమెరికాను నాశనం చేస్తాడని పేర్కొన్నారు. అమెరికా ప్రజల ఆకాంక్షలను మంటగలుపుతాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంక పాల్గొన్నారు.
- August 28, 2020
- Archive
- Top News
- జాతీయం
- AMERICA
- FRIDAY
- NOMINATION
- PRESIDENT
- TRUMP
- అమెరికా
- డొనాల్డ్ట్రంప్
- నామినేషన్
- Comments Off on అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్