సారథి న్యూస్, హుస్నాబాద్ : అధిక విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా కోహెడ, బెజ్జంకి మండల విద్యుత్ శాఖ ఏడీ మాణిక్య లింగానికి వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. పేద ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బులు లేక సతమతమవుతుంటే విద్యుత్ బిల్లులు రూ.1000కి పైగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ నజీర్, వీ పరుశరాములు, రాములు పాల్గొన్నారు.
- June 12, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BC WELFARE
- CONGRESS
- ELECTRICITY BILL
- HUSNABAD
- కాంగ్రెస్ నాయకులు
- Comments Off on అధిక బిల్లులతో అవస్థలు