Breaking News

అద్దె అడిగాడని ఘాతుకం

చెన్నై: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి ఓనర్​ను హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూర్​లో చోటుచేసుకున్నది. కుండ్రటూర్​కు చెందిన గుణశేఖర్​(51) ఇంట్లో కొంతకాలంగా ధనరాజ్​ అనేవ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే నాలుగునెలలుగా ధనరాజ్​ యజమానికి అద్దె​ కట్టడం లేదు. దీంతో బుధవారం రాత్రి రెంట్​ కట్టాలంటూ గుణశేఖర్​.. ధనరాజ్​పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపోధ్రిక్తుడైన ధనరాజ్​ కుమారుడు అజిత్​.. ఇంటి ఓనర్​పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.