లండన్: కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా.. క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకు రావాల్సిన బాధ్యత తమపై కూడా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. కేవలం డబ్బులు, ప్రజాదరణ కోసం తాము ఇక్కడికి రాలేదని స్పష్టం చేశాడు. ‘లాక్‌డౌన్‌తో ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోయారు. క్రికెట్ లేకపోవడంతో చాలా మంది అభిమానులు బాధపడుతున్నారు. కరోనా తగ్గుతుందని ఎదురుచూసే పరిస్థితి ఇప్పుడు లేదు. వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే క్రికెట్‌ను మొదలుపెట్టాలని భావించాం. దీనికితోడు ఎఫ్టీపీ ప్రకారం ఇంగ్లండ్ పర్యటన ఉంది. దానిని మేం నిజం చేస్తున్నాం. అన్ని పరిశీలించిన తర్వాత, అందరం ఓకే అనుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాం. కేవలం డబ్బు, ప్రజాదరణ కోసం రాలేదు. క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకు రావాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది. అందుకే ఏదో ఓ రకంగా మేం ముందడగు వేస్తున్నాం’ అని హోల్డర్ పేర్కొన్నాడు.
- June 12, 2020
- Archive
- Top News
- క్రీడలు
- HOLDER
- WESTINDIES
- ఇంగ్లండ్
- వెస్టిండీస్
- హోల్డర్
- Comments Off on అది మా బాధ్యత