బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అదితీ రావు హైదరి. ఆమె అందం, అభినయానికి అభిమానులు మిలియన్ల లెక్కలో ఉన్నారు. అలాగే తను ఎంచుకునే క్యారెక్టర్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం నాని సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నటిస్తోంది. అదీ నెగెటివ్ పాత్ర చేస్తోంది. తమిళంలో తుగ్లక్ దర్బార్, హే సినామిక, పొన్నియన్ సెల్వం సినిమాలకు సైన్ చేసింది.
రెండు నెలలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఇంట్లో ఉంటున్న అదితి కలరి స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తోంది. సెలబ్రిటీలంతా ఈ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే అదితి కేరళకు సంబంధించిన కలరియపట్టు అనే యుద్ధవిద్యను ప్రాక్టీసు చేయడం మణిరత్నం అప్ కమింగ్ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసమని, అది ఒక పురాతన కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా కనుక దానికోసమే అయి ఉంటుందని కొందరు అనుకుంటుంటే, కాదు దుల్కర్ సల్మాన్ తో రాబోయే ‘హే సినామిక’ సినిమా కోసమని మరికొందరు అనుకుంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఒక హీరోయిన్. ఏదేమైనా తన క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటోంది కనుక అదితి మాత్రం తన స్కిల్స్ ను పెంచుకునే పనిలోనే ఉంది.