ఇటీవలే విడుదలైన గుండమ్మకథ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను సినిమాయూనిట్ విడుదల చేసింది. ఆదిత్య క్రియేషన్స్ పతాకం పై ఆదిత్య, ప్రణవ్యలు జంటగా లక్ష్మీ శ్రీవాత్సవ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీ శ్రీవాత్సవ దర్శకత్వం వహించగా.. సతీశ్ సాధన్ బాణీలు సమకూర్చారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడిన రింగ్ట్రింగ్ అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ఈ పాటకు విఘ్నేష్ శ్రీ విజయ లిరిక్స్ అందజేయగా.. ఈశ్వర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరిస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
- June 14, 2020
- Archive
- సినిమా
- ADITYA CREATION
- GUNDAMMAKATHA
- NEWSONG
- TRAILOR
- ఆదిత్య
- ప్రణవ్య
- Comments Off on అదరగొడుతున్న గుండమ్మకథ ట్రైలర్