Breaking News

అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో గిరిజన యువతిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ.. దోషులకు శిక్షపడాలని డిమాండ్​చేస్తూ.. ఆదివారం మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరేళ్లుగా 139 సార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని డిమాండ్​చేశారు. దోషులను ఎన్ కౌంటర్​ చేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొమ్మాట సుధాకర్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గరుగుల శీను, టంకరి లక్ష్మణ్, ఏకలవ్య ఎరుకుల సంఘం అధ్యక్షుడు కోనేరు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరుశయ్య సభ్యులు కోనేరు వేణు, కుతాడి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.