మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది. విష్ణుకు సిస్టర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్‌ను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం వణికించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పునాది ఇండియాలోనే పడింది. దీనికి సంబంధించిన రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అందుకు తగ్గట్టే అమెరికన్ కరెన్సీ మధ్యలో వాల్ క్లాక్ చూపిస్తూ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ తో ఉన్న టైటిల్ మోషన్ పోస్టర్ ఉంది.
స్టోరీ మొత్తం డాలర్ల (డబ్బు) చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందే మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది. అతిత్వరలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయనున్నారు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి పోలీస్ ఆఫీసర్ గా కీలకపాత్ర పోషిస్తున్నాడు. రుహానీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. చీటింగ్ థ్రిల్లర్ గా ఈ మూవీ మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.