Breaking News

అక్రమ బదిలీలు ఆపండి

సారథిన్యూస్​, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్​జీవన్​ డివిజన్​లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆర్ జీవన్ సంఘం కార్యదర్శి మెండే శ్రీనివాస్, నాయకులు కె రంగారావు , ఏం సారయ్య కార్మికులు పాల్గొన్నారు,