సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో అనధికారికంగా, పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే కట్టడాలను కూల్చివేస్తామని కమిషనర్ డీకే బాలాజీ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఉల్చారోడ్డులో ఉన్న ఎన్టీఆర్ బిల్డింగ్స్ ప్రాంత కూడలిలో పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. వంద అడుగు రోడ్డులో ఆక్రమించి నిర్మించిన కట్టడాలను గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు యజమానుకు మొదటి నోటీసును పంపించారు. వారం రోజులు గడువు ముగిసినా యజమానుల ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండోసారి నోటీసును అందజేసి డిప్యూటీ సిటీ ప్లానర్ కోటయ్య ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి సహాయంతో నిర్మాణాన్ని కూల్చివేశామన్నారు. ఆయన వెంట ఏసీపీ శ్రీనివాసచైతన్య, టీపీఎస్ రాజేష్ ఉన్నారు.
- June 30, 2020
- Archive
- Top News
- కర్నూలు
- Kurnool
- TOWNPLANNING
- కమిషనర్
- కర్నూలు
- టౌన్ ప్లానింగ్
- Comments Off on అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం