Breaking News

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​అన్నివర్గాల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. సమావేశంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్​ తదితరులు పాల్గొన్నారు.