సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో సుమారు 23లక్షల మంది అక్కాచెల్లెళ్లకు నాలుగేళ్లలో రూ.17వేల కోట్ల ఆర్థికసాయం వైఎస్సార్చేయూత పథకం ద్వారా అందుతుందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కాచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సాయం అందిస్తూ వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ వారికి తోడుగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు ఇప్పటికే నెలకు రూ.2,250 చొప్పున మొదటి తారీఖునే వైఎస్సార్పింఛన్కానుకగా అందుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తోడు మూడురెట్లు వివిధ పథకాలు, బ్యాంకుల ద్వారా రుణసాయం అందించి మహిళలను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా చర్యలు తీసుకుంటుందని వివరించారు.
- August 11, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- ANDRAPRADESH
- CM JAGAN
- YSRCHEYUTHA
- YSRPENSION
- ఆంధ్రప్రదేశ్
- వైఎస్సార్చేయూత
- వైఎస్సార్పింఛన్
- Comments Off on అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్ చేయూత