లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా యాక్టింగ్ తో మెప్పిస్తుంటారు హీరోయిన్స్. మరింత మెప్పు పొందాలని..అలాగే తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవాలనే క్యూరియాసిటీతో.. ఇప్పటికే చాలామంది నార్త్ హీరోయిన్స్ తెలుగులో గలగలా మాట్లాడేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ‘అఆ’ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మలయాళీ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ కూడా తెలుగు మాట్లాడడం బాగానే నేర్చుకుంది. అయితే తెలుగు రాయడం కూడా నేర్చుకోవాలనుకుంటుందట. అందుకోసం స్పెషల్ ప్రాక్టీస్ చేస్తోంది ‘కొత్త టార్గెట్ ను ఇప్పుడే మొదలుపెట్టాను, థ్యాంక్స్ గోపీ గారు అంటూ’ అఆలు దిద్దుతూ ట్వీట్ ఒకటి చేసింది. ప్రస్తుతం అనుపమ నిఖిల్ సరసన ‘18 పేజెస్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ, మలయాళ సినిమాలతోనూ బిజీగా ఉంది.
- December 13, 2020
- Archive
- Top News
- సినిమా
- 18 PAGES
- 18 పేజెస్
- ANUPAMA PARAMESHWARAN
- MALAYALI
- అనుపమ పరమేశ్వరన్
- నిఖిల్
- మలయాళీ
- Comments Off on ‘అఆ’లు నేర్చుకుంటుందట..!