సారథి న్యూస్, కర్నూలు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు దళితులు, మైనార్టీలు, ఇతర కులాల పేదలపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు క్ష్మినరసింహా యాదవ్ ఆరోపించారు. సోమవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7న అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. దాడికి నిరసనగా మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు కార్యక్రమాలు చేపట్టి ఎమ్మార్వోలు, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్, హబీబ్ ఖాన్, సంధ్యవెంకటేష్, విజయ్ యాదవ్ పాల్గొన్నారు.
- July 13, 2020
- Archive
- కర్నూలు
- షార్ట్ న్యూస్
- AMBEDKAR
- BJP
- NANDYALA
- అంబేద్కర్
- కాంగ్రెస్
- బీజేపీ
- Comments Off on అంబేద్కర్ ఇంటిపై దాడి అమానుషం