సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమంతా అంబేద్కర్ చూపిన దారిలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా టీఆర్ఎస్ నేత వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసుదేవరావు, టీఆర్ఎస్ నేతలు కనకేశ్, రాజుగౌడ్, ప్రకాశ్, నాగేశ్వరరావు, భాస్కర్, చిన్నవెంకటేశ్వరరావు, ముత్తయ్య, లక్ష్మణ్, సోమయ్య, నరేందర్ రెడ్డి, నాగరాజు, హర్ష, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
- July 14, 2020
- Archive
- ఖమ్మం
- KOTHAGUDEM
- LEADERS
- PALWANCHA
- TRS
- కిన్నెరసాని
- కొత్తగూడెం
- Comments Off on అంబేద్కర్ బాటలో నడుద్దాం