విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నయనతార ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రియుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నయన్ దివ్యాంగురాలి పాత్రలో నటిస్తుందట. విఘ్నేష్ శివన్ కోసం ఈ పాత్రలో నటించడానికి నయన్ ఒప్పుకుందట. నయనతార ప్రస్తుతం ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మన్’ సినిమాలతో పాటు రజనీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రంల్లో నటించాల్సి ఉంది. కరోనాతో వీటి షూటింగ్లు నిలిచిపోయాయి. కరోనా తగ్గాక కొత్తచిత్రాన్ని ప్రారంభిస్తారని తమిళమీడియా టాక్.
- August 12, 2020
- Archive
- Top News
- సినిమా
- ACTRESS
- NAYANATARA
- ROLL
- VIGNESH
- నయనతార
- నయన్
- Comments Off on దివ్యాంగురాలి పాత్రలో నయన్