ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది రష్మిక మందాన్న. అందం, అమాయకత్వం కలబోసిన నటనతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. రష్మిక తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌తో సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం ‘ఆర్య 2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. వరుస విజయాలతో దూసుకెళుతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథనం సాగుతుందట. దాదాపు 60శాతం ఈ సినిమా షూటింగ్ అడవుల్లోనే నిర్వహించనున్నారట. అయితే ఈ సినిమాలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా కనిపించనుందట. దానికి గాను చిత్తూరు యాసలో డబ్బింగ్ చెప్పాలట.
ఇప్పటివరకూ తను నటించిన చిత్రాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చిందీ కన్నడ భామ. ఈ సినిమా మొత్తం చిత్తూరు భాష మాట్లాడాలి కాబట్టి రష్మిక ఆ యాస నేర్చుకోవాల్సి ఉందట. అయితే ఆ పాత్ర చేయడమే రష్మికకు ఒక ఛాలెంజ్ అయితే ఆ భాష మాట్లాడాల్సి రావడం ఇంకా కష్టం. అందుకే ఆ పాత్రకు డబ్బింగ్ అంటే అన్నీ పర్ఫెక్ట్ ఉండాలని రష్మిక కాస్త టెన్షన్ పడుతుందట. అయితే సుకుమార్ ఉండగా టెన్షన్ ఎందుకని.. రష్మిక డబ్బింగ్ విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదని వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పిస్తాడని టాక్. మరీ సమస్య గట్టెక్కించడానికి సీనియర్ డైరెక్టర్ అండ ఉండగా నువ్వెందుకు టెన్షన్ పడాలి… అని అభిప్రాయ పడుతున్నారు నెటిజన్లు.