పదేండ్లు కూడా దాటని పిల్లలకు ఆన్లైన్ క్లాస్లేంటని జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రశ్నించింది. అన్ని విషయాల్లోనూ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ పిల్లల ఆన్లైన్ క్లాసులపైనా మాట్లాడింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో పిల్లలను స్కూల్ కు పంపించకుండా ఆన్ లైన్ ల్లోనే పాఠాలను చెప్పేస్తున్నారు. అన్ని స్కూల్స్ ఆన్ లైన్ క్లాస్ లు ప్రారంభించాయి. గంటల తరబడి పిల్లలు లాప్టాప్ స్క్రీన్ ముందు ఉంటే వారి ఆరోగ్యాలు ఏమవుతాయి అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్ల లోపు పిల్లల ఆన్ లైన్ క్లాస్ ల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలని కోరింది. కాగా అనసూయ లేవనెత్తిన ఈ అంశంపై పలువురు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అనసూయ లేవనెత్తిన అంశాన్ని బలపరుస్తూ కామెంట్లు పెట్టారు.
- June 14, 2020
- Archive
- సినిమా
- ANASUYA
- ANCHOR
- JABARDASTH
- ONLINE CLASSES
- కామెంట్లు
- నెట్జన్లు
- Comments Off on అంత చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులా..