సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘పవర్‌స్టార్ ’ యూట్యూబ్‌లో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. దీనిపై అతడు ఊహించినట్టుగానే వివాదం రాజుకున్నది. కొంతకాలంగా కామ్‌గా ఉన్న పవన్‌కల్యాణ్ అభిమానులు ట్రైలర్ రిలీజ్కాగానే రెచ్చిపోయారు. సోషల్‌మీడియాలో ఆర్జీవీపై కామెంట్లు మెదలు పెట్టారు. మరోవైపు పవన్‌కల్యాన్‌ను అభిమానించే యువనటుడు నిఖిల్ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసి పవన్‌కల్యాన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు బిగ్‌బాస్ ఫేం పవన్ కల్యాణ్ అభిమాని నూతన్‌నాయుడు ‘పరాన్నజీవి’ అంటూ ఆర్జీవీపై ఏకంగా ఓ సినిమానే తీస్తున్నాడు. ఆర్జీవీకి మాత్రం తాను కోరుకున్నట్టుగానే విడుదల చేసిన ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. తను సినిమాను సినీప్రియులతోపాటు కూడా పవన్‌కల్యాణ్ అభిమానులు కూడా చూస్తారంటూ వాఖ్యానించాడు ఆర్జీవీ. ఏది ఏమయినప్పటికీ ఆర్జీవీ ఆశించినట్టుగానే తన సినిమా వివాదాస్పదమైంది. కోరుకున్నట్టే ఫ్రీ పబ్లిసిటీ దక్కింది. కొన్నిగంటల్లోనే పవర్‌స్టార్ ట్రైలర్ 8 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకొన్నది.
- July 22, 2020
- Archive
- సినిమా
- DIRECTOR
- POWERSTAR
- RGV
- TRAILER
- VIRAL
- పవర్‌స్టార్
- రాంగోపాల్‌వర్మ
- Comments Off on అంతా వర్మ అనుకున్నట్టే..