![రో‘హిట్’ మెరుపులు.. ముంబై 210](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/rohit.jpg?fit=677%2C429&ssl=1)
అబుదాబి: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మవీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్ ఓపెనర్ డికాక్ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. సౌరవ్తివారి 13 బంతుల్లో 21 రన్స్ చేశాడు. హర్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు, పొలార్డ్ 13(7 బంతుల్లో) పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచిన కలకత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బౌలర్స్ శివమ్ మావి రెండు వికెట్లు తీశాడు. అండ్రు రస్సెల్ ఒక వికెట్ తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి కలకత్తా నైట్ రైడర్స్ కు 196 పరుగుల లక్ష్యాన్ని విధించింది.