అబుదాబి: ఐపీఎల్13 సీజన్లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ కు ముంబై ఇండియన్స్192 పరుగుల టార్గెట్ ఇచ్చింది. చివరి ఓవర్లలో పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్‌లతో అద్భుతంగా బ్యాటింగ్చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. ముంబై కెప్టెన్ రోహిత్‌శర్మ 70(45 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లు) పరుగులు చేశాడు. సూర్యాకుమార్ యాదవ్ 10, ఇషాన్‌కిషన్28(32 బంతుల్లో సిక్స్, ఒక ఫోర్), పొలార్డ్ 47(20 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు), హార్దిక్‌పాండ్యా 30(11 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు) పరుగులు చేశాడు. కింగ్స్‌లెవన్ పంజాబ్ బౌలర్లు షెల్డన్ కాట్రెల్ ఒకటి, మహ్మద్‌షమీ ఒకటి, గౌతమ్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
- October 1, 2020
- Archive
- Top News
- క్రీడలు
- KINGS ELEVEN
- MUMBAI INDIANS
- POLLARD
- PUNJAB
- కింగ్స్లెవన్పంజాబ్
- పంజాబ్
- పొలార్డ్
- ముంబై ఇండియన్స్
- రోహిత్‌శర్మ
- Comments Off on రో‘హిట్’.. ముంబై 191