
- రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్
- కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి
అబుదాబి: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన కలకత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్‌యాదవ్28 బంతుల్లో 47 పరుగుల చేశారు. సౌరవ్ తివారీ 13 బంతుల్లో 21 రన్స్‌చేశాడు. హర్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లు శివమ్ మావి రెండు వికెట్లు తీశాడు. అండ్రు రస్సెల్, నరైన్ చేరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కలకత్తా నైట్‌రైడర్స్ జట్టు ఓపెనర్లు శుభమన్ గిల్7(11 బంతుల్లో), ఎస్పీ నరైన్10(9 బంతుల్లో) పరుగులతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చి కేడీ కార్తీక్30(23 బంతుల్లో), ఎన్రానా 24(18 బంతుల్లో ) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా.. క్రీజ్‌లో ఎంత సేపూ నిలవలేదు. జట్టులో పీజే కమిన్స్ 33(12) తప్ప పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. 20 ఓవర్లలో 146 స్కోరు వద్దే ఆలౌటయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు టీఏ బౌల్ట్ 2, జేఎల్పాటిసన్ 2, బుమ్రా 2, ఆర్డీ చాహర్2, కేఏ పొలార్డ్ఒకటి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రోహిత్‌శర్మ నిలిచారు.