అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్ విసిరిన ముంబై.. ఆపై కింగ్స్ పంజాబ్‌ను కట్టడి చేసింది. మాయంక్ అగర్వాల్(25), కేఎల్ రాహుల్(17) మాత్రమే చేసేలా ముంబై బౌలర్లు కట్టడి చేశారు. కరుణ్ నాయర్(0), మ్యాక్స్‌వెల్(11), పూరన్(44), గౌతమ్(22) పరుగులు చేశారు. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, పాటిన్సన్, రాహుల్ చాహర్ రెండు వికెట్ల చొప్పున తీయగా, బౌల్ట్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు.
టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రోహిత్(70), పొలార్డ్(47 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 నాటౌట్) పరుగులతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతమ్ ఒక్కో వికెట్ తీశారు.
- October 1, 2020
- Archive
- Top News
- క్రీడలు
- IPL13
- KINGS PUNJAB
- MUMBAI INDIANS
- ఐపీఎల్13
- కింగ్స్ పంజాబ్
- కేఎల్ రాహుల్
- ముంబై ఇండియన్స్
- Comments Off on ముంబై జయకేతనం