అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్లో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్ రాయల్స్ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్‌పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్), రోహిత్‌శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యాకుమార్ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. హార్ధిక్‌పాండ్యా 30( 19 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్బౌలర్లలో ఎస్ గోపాల్ రెండు, అర్చర్, కార్తీక్‌త్యాగి చేరో వికెట్చొప్పున తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే తడబడింది. స్టార్ ఓపెనర్ జేసీ బట్లర్ 70 (44 బంతులు, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులతో రాణించాడు. జేసీ అర్చర్ 24( 11 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), టీకే కురాన్15 పరుగులు చేశారు. మిగతావారు రెండంకెల స్కోరును దాటలేదు. 18.1 ఓవర్ల 136 పరుగులకే అలౌట్ అయ్యారు. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు, బౌల్ట్, పాటిస్సన్ చెరో రెండు, చాహర్, పొలార్డ్ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
- October 6, 2020
- Archive
- Top News
- క్రీడలు
- ABUDABI
- MUMBAI INDIANS
- RAJASTANROYALS
- ROHITHSHARMA
- అబుదాబి
- ముంబై ఇండియన్స్
- రాజస్థాన్రాయల్స్
- రోహిత్‌శర్మ
- Comments Off on ‘ముంబై’దే మరోసారి పైచేయి